శర్వానంద్…జాను అప్‌డేట్స్

489
sharwananad
- Advertisement -

తమిళ్ లో భారీ విజయం సాధించిన 96 మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా తెలుగులో సమంత, శర్వానంద్‌లు హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తమిళ్‌లో 96ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి జాను అనే టైటిల్‌ని ఖరారు చేయగా ఇటివలే ఈమూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే ప్రమోషన్‌లో భాగంగా సినిమా నుంచి పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఎడారిలో శర్వనాంద్ ట్రావెల్‌ చేస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకోగా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -