కీలక షెడ్యూల్‌లో శర్వా 37!

12
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు నటుడు శర్వానంద్. శర్వా 37 సినిమా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వస్తుండగా ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. శర్వానంద్ సరసన మాళవిక నాయర్ నటిస్తుండగా ఇటీవలే శర్వానంద్, ప్రముఖ నటుడు రాజశేఖర్, బ్రహ్మాజీలతో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేయడంతో ఈ చిత్రం దృష్టిని ఆకర్షించింది.

ఇప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తికాగా మిగిలిన పార్ట్‌ల‌ను వ‌చ్చే షెడ్యూల్‌లో పూర్తి చేయ‌నున్నారు. తదుపరి దశ చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు.

శర్వా 35వ చిత్రం ‘మనమే’తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ లావిష్ గా నిర్మించిన ఈ చిత్రం సమ్మర్ రేసులో చేరింది. సమ్మర్ ని ముగించడానికి మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసినట్లుగా జూన్ 7న ‘మనమే’ విడుదల కానుంది.

Also Read:సన్‌రైజర్స్ సంచలన విజయం..

- Advertisement -