బిగ్‌ బి మూవీకి నిర్మాతగా బాద్‌ షా‌..!

252
amitabh shahrukh
- Advertisement -

బాలీవుడ్‌లో స్టార్ హీరోల మల్టీస్టారర్‌ సినిమాలు,ఇద్దరు అగ్రహీరోలు కలిసి ఓ సినిమాకు నిర్మాతగా చేయడం కొత్తేమీ కాదు. ఇలా వచ్చిన చాలా సినిమాలు బీ టౌన్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచాయి. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మూవీకి నిర్మాతగా బాద్‌ షా షారుఖ్ ఖాన్ వ్యవహరించనున్నాడు.

కహానీ ఫేమ్ సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో అమితాబ్,తాప్సీ కీ రోల్‌లో నటిస్తున్న సినిమా బాద్లా. ఇటీవలె సినిమా షూటింగ్ స్కాట్లాండ్‌లోని గ్లాస్కోలో మొదలైంది. సునీర్,ఆకాశ్‌ పూరిలతో కలిసి షారుఖ్ ఖాన్‌ తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ద్వారా ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇదిఇలా ఉండగా 2008లో బుత్‌నాథ్ సినిమాతో పాటు మెహబ్బతిన్,కబీ కుషి కబీ గమ్‌ సినిమాల్లో కలిసి నటించారు. తాజాగా అమితాబ్ సినిమాకు షారుఖ్ నిర్మాతగా మారడం విశేషం.

పింక్ సినిమాలో అమితాబ్‌తో నటించి మంచి మార్కులు కొట్టేసిన తాప్సీ మరోసారి ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది. కాంట్రాటైమ్‌పో అనే స్పెయిన్‌ చిత్రానికి రిమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే సినిమా యూనిట్‌తో జాయిన్‌ అవుతాను…ఆల్‌ ది బెస్ట్‌ అని ట్వీట్ చేశారు అమితాబ్‌. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్‌ ఏజెంట్‌ పాత్రలో అమితాబ్‌ కనిపిస్తారని టాక్‌.

- Advertisement -