లైవ్‎‏లో రిపోర్టర్‎‏కి ముద్దుపెట్టాడు…

228
SPORT-PREVIEW-Reporter-Kiss
- Advertisement -

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫిఫా ఫివర్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఫిఫా ప్రపంచకప్ పోటీలను కవర్ చేయడానికి పలు దేశాల మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్తున్నారు. మ్యాచ్ కు ముందుకు, మ్యాచ్ తరువాత అంటూ లైవ్ లు ఇస్తున్నారు. జర్మనీ ఛానల్ కి చెందిన జులియత్ అనే లేడీ రిపోర్టర్ ప్రతి రోజు లైవ్ అప్ డేట్స్ ఇస్తూ వస్తోంది. ఇదే క్రమంలో లైప్ ఇచ్చేందుకు కెమెరామెన్ తో సహా సిద్దంగా ఉంది.

female World Cup reporter

అప్పుడే లైవ్ స్టార్ చేసి ఆమె మాట్లాడుతున్న తరుణంలో అక్కడికి వచ్చిన ఓ ఫుట్ బాల్ అభిమాని ఆ రిపోర్టర్ కి ముద్దు ఇచ్చి వెల్లిపోయాడు. ఆ వ్యక్తి ముద్దు పెట్టినప్పటికీ జులియత్ మాత్రం తడబడకుండా లైవ్ ఇచ్చి తన కార్యక్రమాన్ని ముగించింది.

లైవ్ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే ఆ వ్యక్తిని వెతకడం మొదలు పెట్టింది జులియత్. ఎంతవెతికినా ఆ వ్యక్తి కనిపించలేదు. ఆ ముద్దు పెట్టిన వీడియో క్లిప్ ని జులియత్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసింది. రెండు మూడు గంటల నుంచి అక్కడే ఉన్నానని, తన ఫ్రోగ్రాం ఇచ్చేందుకు అంతా సిద్దం చేసుకున్నా, లైవ్ స్టార్ అయిన కొద్ది క్షణాలకే ఓ వ్యక్తి వచ్చి ముద్దు పెట్టివెళ్లాడని చెప్పుకొచ్చింది.

ఆ వ్యక్తి అలా చేయడంతో తడబాటు మొదలైందని, కాని కనిపించనివ్వకుండా కవర్ చేశానని పేర్కొంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు పనిపట్ల ఉన్న నిబధతకు మెచ్చుకుంటున్నారు. ఆ ముద్దు పెట్టిన వ్యక్తిని పట్టుకుని జైలుకు పంపించాలని కామెంట్లు చేస్తున్నారు.

https://instagram.com/juliethgonzaleztheran/?utm_source=ig_embed

ఫేస్‌బుక్‌లో ఫిఫా ఫీవర్..

- Advertisement -