బాలయ్య టైటిల్‌తో షారుఖ్‌..!

55
srk

నందమూరి బాలకృష్ణ హీరోగా సత్యదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లయన్. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటించగా మూవీ పర్వాలేదనిపించగా తాజాగా ఇప్పుడు ఇదే టైటిల్‌తో బాలీవుడ్ మూవీ రానుంది.

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ హీరోగా లయన్ సినిమా తెరకెక్కుతోంది. నయనతార, ప్రియమణి ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటించనుండగా రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూణేలో చిత్రీకరించారు.

షారుఖ్ – అట్లీ చిత్రానికి లయన్ అనే టైటిల్ పెట్టారని…. పూణేలోని సంత్ తుకారామ్ నగర్ మెట్రో స్టేషన్‌లో చిత్రీకరణకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాణ బృందం రాసిన లేఖలో ఈ చిత్రానికి “లయన్” అనే పేరు పెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.