చిన్నారి హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్య..

102
raju

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హ‌త్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వ‌రంగ‌ల్ జిల్లాలోని న‌ష్‌క‌ల్‌ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. చేతిపై ఉన్న టాటూను చూసి నిందితుడు రాజును పోలీసులు గుర్తించారు.

సైదాబాద్‌లో హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌. తీరని దుఃఖంలోఉన్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రులు..రూ. 20 లక్షల ఆర్ధికసాయం అందించారు.