సౌత్ లోనూ షారుఖ్ రికార్డుల వేట

16
- Advertisement -

బాలీవుడ్ హీరో షారుక్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ ఈ నెల 7న విడుదలైంది. తొలిరోజు ఈ సినిమా రూ.126 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రెండో రోజు కూడా తగ్గేదేలే అన్న రీతిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ఏకంగా రూ.113 కోట్ల మేర వసూలు చేసింది. మొత్తానికి రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఈ సినిమాకు రూ.234.29 కోట్లు వచ్చినట్లు సినీ వర్గాలు ప్రకటించాయి. ‘జవాన్’కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు, నేడు, రేపు వీకెండ్ కావడంతో భారీ కలెక్షన్లు వస్తాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం అయితే.. ఈ వీకెండ్‌ పూర్తయ్యేసరికి రూ.500 కోట్ల క్లబ్బులో చేరే అవకాశం ఉంది.

నిజంగా బాలీవుడ్ బాద్ షా రికార్డులు సృష్టిస్తున్నాడు. పైగా జవాన్ మూవీ అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. దీంతో దర్శకధీరుడు రాజమౌళి మూవీపై స్పందిస్తూ.. షారుఖ్ బాక్సాఫీస్ బాద్ షా కావడానికి కారణం ఇదేనంటూ మూవీ టీమ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. దీంతో షారుఖ్.. రాజమౌళికి థాంక్స్ చెబుతూ, వీలైనప్పుడు మూవీ చూసి.. ఆ తర్వాత తనకు కాల్ చేసి, తాను కూడా మాస్ హీరోనే అని చెప్పాలని రీట్వీట్ చేశాడు. మొత్తమ్మీద షారుఖ్ ఖాన్ కి రాజమౌళి ఫోన్ చేస్తాడో లేదో చూడాలి.

Also Read:జవాన్ సునామీ.. రెండు రోజుల్లో 250 కోట్లు

ఏది ఏమైనా షారుఖ్ ఖాన్ తో అట్లీ అదిరిపోయే హిట్ కొట్టాడు. ‘జవాన్’ సినిమా సౌత్ బాక్సాఫీసు దగ్గర ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో షారుఖ్, నయనతార, విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అయితే గూస్‌ బంప్స్ తెప్పించాయి. పదునైన స్క్రీన్‌ప్లే, అద్భుతమైన ఎమోషనల్ సీక్వెన్సులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Also Read:ఎన్టీఆర్..మరో మూవీ రీ రిలీజ్!

- Advertisement -