కేఏ పాల్ – షర్మిల..దొందూ దొందే!

96
- Advertisement -

రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్ట్‌ల హడావిడి ఎక్కువై పోయింది. కేవలం మూడు ఎమ్మెల్యే స్ధానాలున్న బీజేపీ…90 శాతంకి పైగా ఎమ్మెల్యేలున్న టీఆర్ఎస్‌పై అవాకులు ఛవాకులు పేలుతోంది. మత,విభజన, విద్వేశ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. అయితే సీఎం కేసీఆర్ నాయకత్వం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ముందు కాషాయ నేతల పప్పులు ఉడకట్లేదు.

ఇక సందెట్లో సడేమియా అన్నట్లుగా పక్కరాష్ట్రం నుండి వచ్చి ఇక్కడి రాజన్న రాజ్యం తెస్తా అని ఒకరంటుండగా మరొకరూ రాజన్న రాజ్యం అవసరం లేదని వారికి వారే కొట్టుకుంటున్నారు. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా షర్మిల- కేఏపాల్. వాస్తవానికి కేఏ పాల్‌ గతమెంతో గనం. వివిధ దేశాల అధ్యక్షులు సైతం కేఏ పాల్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేది..కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్‌. కేఏ పాల్ సైతం వార్డు మెంబర్‌గా గెలవలేనని పరిస్థితి. ఏపీలో పోటీ చేసి బొక్కబొర్లా పడ్డ పాల్ తెలంగాణ రాజకీయాల్లో ఏదో చేస్తాని వచ్చారు. సంక్రాంతి గంగిరెద్దులాగా డ్యాన్స్‌లు చేస్తూ సీఎం కేసీఆర్‌ని విమర్శిస్తుండగా ప్రజలు ఆయన వేష,భాషను చూసి నవ్వుకునే పరిస్థితి నెలకొంది.

ఇక తనకు తానే ఏదో గొప్ప నాయకురాలినని ఊహించుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మరో ఆణిముత్యం షర్మిల. రాజన్న రాజ్యం పేరుతో సీఎం కేసీఆర్ టార్గెట్‌గా తన స్ధాయిని మరచి విమర్శలు చేస్తూ ముందుకుసాగుతోంది. వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో పాదయాత్ర చేస్తూ అడ్డగోలు మాటలు మాట్లాడుతూ మరో కేఏ పాల్‌ని తలపిస్తోంది. ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు కనీసం ఒక్క వార్డు మెంబర్ కూడా షర్మిల పార్టీకి లేదు కానీ ఆమె మాత్రం తానే సీఎంలా ఉహించుకుంటూ పగటికలలు కంటోంది.

అసలు షర్మిల చేస్తున్న పాదయాత్రకు స్పందన అంతంతమాత్రమే వస్తుండటంతో టీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ పొలిటికల్ మైలేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ఎత్తుగడ తెలంగాణ ప్రజల ముందుపారడం లేదు. వాస్తవానికి షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడమే ఆమె చేసిన పెద్ద మిస్టేక్. ఎందుకంటే తెలంగాణ వచ్చిందే స్వరాష్ట్రం నినాదం నుండి…అదే మరచి పక్కరాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే ప్రజలు ఆదరించరు. ఇందుకు ఉదాహరణే టీడీపీ.

ఈ చిన్న లాజిక్ మరచి వందల కోట్ల ధనాన్ని వృధా చేసుకుంటున్నారు షర్మిల. అందుకే 3 వేల కిలోమీటర్లు నడిచినా షర్మిల ప్రస్తావన తూతూ మంత్రంగానే మిగిలింది. దీనికి తోడు ఆ పార్టీలో ఒక్కరంటే ఒక్కరు పేరున్న నాయకులెవరు లేరు. ఉన్నదంతా ఆమె భజనపరులు, పేపర్ పులులు. ప్రజల్లో పట్టు ఉన్న నేతలు లేకపోవడంతో వైఎస్‌ఆర్ టీపీలో ఉన్న నాయకులెవరో ఆమెకే తెలియని పరిస్థితి. దీంతో ప్రజలు పాల్ – షర్మిలను ఇద్దరిని పొలిటికల్ జోకర్లుగా సినిమాల్లో కామెడీలాగా వారిని లైట్ తీసుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -