షర్మిల ఎఫెక్ట్ : కాంగ్రెస్ లోకి వలసలు?

35
- Advertisement -

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన తరువాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలలోని అసంతృప్త నేతలు షర్మిల పక్షాన చేరేందుకు సిద్దమౌతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి భారీగా వలసలు పెరిగే అవకాశం ఉన్నట్లు టాక్. సర్వేల ఆధారంగా భారీగా మార్పులు జరుగుతున్న వైసీపీలో అసంతృప్త వాదులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు రాజీనామాల బాటా పట్టారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, వంటి వారితో లిస్ట్ లో చాలమందే ఉన్నారు. ఇలా వైసీపీలోని అసంతృప్త నేతలంతా కూడా ఇప్పుడు షర్మిల నాయకత్వం వహించే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమౌతున్నట్లు వినికిడి. .

గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారు సైతం ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు కొత్త మార్గం వేసుకుంటున్నారట. అటు టీడీపీలో కూడా సీట్లు దక్కని వారు నెక్స్ట్ ఆప్షన్ గా షర్మిల వైపే చూస్తున్నారట. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరో రెండు లేదా మూడు రోజుల్లో షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితం అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత నుంచి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా తెలంగాణలో కంప్లీట్ గా ఫెయిల్ అయిన షర్మిల ఏపీలో మాత్రం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏపీలో భూ స్థాపితం అయిన కాంగ్రెస్ పార్టీని షర్మిల ఎంత వరకు పైకి తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారిన అంశం.

Also Read:BJP:బీజేపీలో అధ్యక్షుల మార్పు?

- Advertisement -