ఐరన్ లోపిస్తే.. అంతేనా?

125
- Advertisement -

మనం ఆరోగ్యంగా ఉండడానికి శరీరంలోని అన్నీ అవయవాలు సక్రమంగా పని చేయాల్సి ఉంటుంది. అవయవాలన్నీ సరిగ్గా పని చేయాలంటే వాటికి తగినంత శక్తి చాలా అవసరం. మనం తినే ఆహారంలోని పోషకాల ద్వారా మన శరీరంలోని అన్నీ అవయవాలు శక్తినొందుతాయి. మన శరీరానికి కావలసిన పోషకాలలో విటమిన్లు, ప్రోటీన్ల అవసరంతో పాటు మూలకాలు మరియు ఖనిజాలు వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఎంతో అవసరం. వీటిలో ఏ ఒక్కటి తక్కువైన ఏదో ఒక అసమతుల్యత మన శరీరాన్ని ఆవహిస్తుంది. కాబట్టి సూక్ష్మ పోషకాలలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటివి ఎంతో ముఖ్యం. అయితే మిగిలిన మూలకాలతో పోల్చితే మన శరీరంలో ఐరన్ తగ్గితే వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువ. కాబట్టి మన శరీరంలో ఐరన్ తగ్గడానికి గల కారణాలు, వచ్చే సమస్యలు, వంటి నివారణ వంటి విషయాలను ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం !

శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. శరీర కణజాలలకు రక్తంలోని ఆక్సిజన్ సరఫరా చేయడంలో హిమోగ్లోబిన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ యొక్క హిమోగ్లోబిన్ లో ఐరన్ శాతం తక్కువన్నప్పుడు ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ప్రతి చిన్న పనికి అలసట ఏర్పడడం, శరీరం బలహీనంగా తయారవ్వడం, చర్మం పలుచగా మారడం వంటి సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, గోళ్ళు పేలుసుగా మారడం వంటి లక్షణాలు ఐరన్ లోపాన్ని సూచిస్తాయి. స్త్రీలలో రుతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం వల్ల కూడా ఐరన్ లోపం గానే గుర్తించవచ్చు. కాబట్టి ఐరన్ లోపం అనీమియాకు దారి తీస్తుంది కాబట్టి దీనిని అశ్రద్ద వహించరాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: సల్మాన్ వల్లే తల్లి అయ్యిందట

మనం తీసుకునే ఆహారంలో సరైన పోషక విలువలు లేకపోవడం కూడా ఐరన్ లోపానికి ఒక కారణంగా చెప్పవచ్చు. కాబట్టి ఐరన్ ఎక్కువగా లభించే ఆహారాన్ని తినడం మన దినచర్యలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలలో క్యాబేజీ, బీట్ రూట్, క్యారెట్, వంటి వాటిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. ఇక చేపలు, గుడ్లు కూడా ఐరన్ పోషకాలే. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు కూడా మన శరీరానికి ఐరన్ అందిస్తాయి. ఉదాహరణకు నారింజ పండు, కివీ పండు, పుచ్చకాయ, కర్బూజ.. వంటివి. కాబట్టి ఐరన్ లోపం ఉన్నట్లు గుర్తించిన వాళ్ళు ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఐరన్ లోపాన్ని ఎదుర్కోవచ్చు.

Also Read: ‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

( గమనిక : ఇంటర్నెట్ లోని సమాచారం మేరకు ఈ వార్తా అందించడం జరిగింది. ఇది అవగాహన కోసమే తప్పా.. దృవీకరించబడలేదు. కాబట్టి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య ఉన్న వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.)

- Advertisement -