అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్ లో ఓ వ్యక్తి చేసిన కాల్పుల్లో వరంగల్ కు చెందిన కొప్పు శరత్ మృతి చెందిన విషయం తెలిసిందే. శరత్ మిస్సోరిలోని క్యాన్సర్ ప్రాంతంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. శరత్ మృతదేహన్ని హైదరబాద్ తీసకురావడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాకం అందించింది.వరంగల్ నగరంలొని శరత్ కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్, డిప్యూటి సీఎం కడియం శ్రీహరి పరామర్శించారు.
దుండగులను వీలైనంత త్వరలో పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున భారత దౌత్య అధికారులు, అమెరికా ఎంబసీ అధికారులతో మాట్లాడామని చెప్పారు మంత్రి కడియం. దుండగులను గుర్తించేందుకు 10వేల డాలర్ల పారితోషికాన్ని అమెరికా అధికారులు ప్రకటించారని తెలిపారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు.
నిన్న రాత్రి శరత్ మృతదేహన్ని శంషాబాద్ విమానాశ్రాయనికి తరలించారు. తెల్లవారుజామున ఆయన స్వస్ధలం వరంగల్ కు తరలించారు. వరంగల్ లోని ఎస్ ఆర్ ఆర్ తోట స్మశాన వాటికలో శరత్ అంత్యక్రియలు జరగనున్నాయి. శరత్ మృతదేహన్ని చూసిన తల్లితండ్రులు బోరున విలపిస్తున్నారు.