- Advertisement -
‘పొగాకు, సుపారికి అలవాటుపడి చాలా తప్పు చేశాను. అసలు నన్ను 40 ఏళ్ళక్రితమే హెచ్చరించి ఉంటే బాగుండేది’ అని చెప్పుకొచ్చారు నెషనలిస్ట్ కాంగ్రెస్‌పార్టీ(ఎన్పీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్.
నోటి కేన్స్‌ర్‌ను రూపుమాపేందుకు ఏర్పాటైన ‘ఇండియన్ డెంటల్ అసోసియేషన్ మిషన్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన శరద్‌పవార్ తాను కేన్సర్ నుంచి బయటపడేందుకు శస్ర్తచికిత్స చేయించుకోవాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పొగాకు, సుపారీలకు అలవాటుపడ్డ ఆయన సర్జరీ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అంతేకాకుండా దాని కారణంగానే ఇప్పటికీ నోరు తరవలేకపోతున్నానని, మాట్లాడేందుకు, ఆహారం తీసుకుంనేందుకు కూడా చాలా కష్టంగా ఉందంటూ వెల్లడించారు. ఇప్పటికైనా యువతలో మార్పురావాలని అన్నారు.
యువత దురలవాట్లకు లోనవుతోందని, అలాంటి వారిలో అవగాహన తెచ్చేందుకు సహాయపడతానని కూడా ఆయన తెలిపారు.
- Advertisement -