సిరికి క్యారెక్ట‌ర్ లేదు: ష‌ణ్ముఖ్

188
siri
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా ఆరో వారం పూర్తి చేసుకునేందుకు వచ్చింది. శుక్ర‌వారం బ‌డ్జెట్ టాస్క్‌లో బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌కి ప‌గ‌ల గొట్టిన వారిదే పండ‌గ అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా పలు గేమ్స్ ఆడగా ఆట మొద‌ల‌వ‌క‌ముందే డ్రాప్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించి షాకిచ్చాడు షణ్ముఖ్.

యాపిల్స్‌తో ట‌వ‌ర్ కట్టే టాస్కులో శ్వేత ప్రియాంకను ఓడించ‌గా ఆమె ప‌గ‌ల‌గొట్టిన కుండ‌లో మ‌ట‌న్ వ‌చ్చింది. మిగ‌తా గేమ్స్‌లో లోబో, ర‌వి, కాజ‌ల్ గెల‌వ‌గా వారు కుండ‌లు ప‌గ‌ల‌గొట్టి ప‌లు వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇక టాస్క్ సమయంలో ష‌ణ్ముఖ్‌.. సిరిని క్యారెక్ట‌ర్‌ లేద‌ని అన‌డంతో అల‌క‌బూనింది. నాకు క్యారెక్టర్ లేదు కదా.. అలాంటప్పుడు నాతో ఎందుకు స్నేహం చేస్తున్నారు.. చెయ్యొద్దు కదా అని చెప్పుకొచ్చింది. ఇక తర్వాత ప్రియాంక వచ్చి.. జెస్సీతో నువ్ నాకు ప్రపోజ్ చేయాల్సి వస్తే ఎలా చేస్తావ్ అని అడుగుతుంది.. నేను నీకు ప్రపోజ్ చేయను.. సిరికి మాత్రమే చేస్తా అని అంటాడు.

- Advertisement -