మా కార్యవర్గ ప్రమాణస్వీకారం..అతిథి ఎవరో తెలుసా?

47
talasani

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక కొత్తకార్యవర్గం ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనుండగా ఇండస్ట్రీలోని పెద్దలందరిని కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు విష్ణు.

ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుగగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

నందమూరి బాలకృష్ణ లాంటివారిని స్వయంగా కలవగా మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారా లేదా ఆహ్వానించారా అనేదానిపై క్లారిటీ లేదు. ప్రమాణ స్వీకారానికి ముందే బాధ్యతలు చేపట్టారు విష్ణు. ఇక, ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలిచిన అంతా రాజీనామాలు చేసిన నేపథ్యంలో.. రేపటి కార్యక్రమం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.