ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

13
- Advertisement -

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంకబ్రత బాగ్జీని నియమించింది ఈసీ. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఆ పదవిలోకొనసాగనున్నారు. సోమవారం ఉదయం11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది.

నూతన డీజీపీ ఎంపిక జాబితాలో సీహెచ్‌ తిరుమల రావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్‌లు ఉన్నారు. తిరుమల రావు, అంజనా సిన్హా 1990వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు కాగా, మాదిరెద్ది ప్రతాప్‌ 1991వ బ్యాచ్‌కు చెందినవారు. తిరుమల రావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉండగా, అంజనా సిన్హా రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‎గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Also Read:రాజుయాదవ్..ట్రైలర్ బాగుంది

- Advertisement -