‘మ‌హర్షీ’ విడుద‌ల తేదీ వాయిదా

190
Maharshi

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా మ‌హ‌ర్షీ సినిమాలో బిజీగా ఉన్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈమూవీని ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వీనిద‌త్ లు నిర్మిస్తున్నారు. మ‌హేశ్ స‌ర‌స‌న హీరోయిన్ గా పూజా హెగ్డె న‌టించ‌గా, అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈసినిమా ఇప్ప‌టికే 70శాతం చిత్రిక‌ర‌ణ పూర్తి చేసుకున్న‌ట్లు స‌మాచారం.

maharshi mahesh

మ‌రో రెండు షెడ్యూల్లో పూర్తిగా కంప్లీట్ అవుతుందంటున్నారు చిత్ర‌యూనిట్. మొద‌ట ఈమూవీని ఎప్రిల్ 5వ తేదిన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆ డేట్ ను వాయిదా వేసినట్టు స‌మాచారం.

తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈసినిమాను ఎప్రిల్ 26న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. గతంలో మహేశ్ చేసిన ‘పోకిరి’ .. ‘భరత్ అనే నేను’ సినిమాలు ఏప్రిల్ చివరివారంలో విడుదలై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో మ‌హ‌ర్షీ మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.