రెగ్యులర్‌ షూటింగ్‌లో ‘శనార్తి’

3
- Advertisement -

ఆదిత్య మూవీస్ సమర్పణ లో సంపత్ నంది టీమ్ వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రోడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రాజ్ వెడ్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ రాజ్, ఫోక్ క్వీన్ నాగదుర్గ హీరో, హీరోయిన్ లుగా రాబోతున్న చిత్రం “శనార్తి ” రెగ్యులర్ షూట్ కరీంనగర్ జిల్లా వెలిచాల లో పూజ కార్యక్రమం తో ఘనంగా మొదలయింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సంపత్ నంది, ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, ఇతర నటీనటులు పాల్గొన్నారు. సుమారు నెల పాటు వెలిచాల, గట్టు భూత్కూర్ లో జరగనుంది. ఈ చిత్ర దర్శకులు గణేష్ రాజ్ ఉప్పునూటి గంగాధర మండలం, గట్టు బూత్కూర్ చెందిన వారు కావడం విశేషం.

తెలంగాణ సంప్రదాయ, సాంస్కృతిక మూలాల్ని గుర్తు చేసే ఈ చిత్రం ఒక మరిచిపోలేని మైలురాయి గా నిలవనుంది.రచయితగా, కథకుడిగా, షోరన్నర్‌గా తనకున్న ప్రతిభతో పేరుగాంచిన దర్శకుడు సంపత్ నంది ‘ఓదెల’ ఫ్రాంచైజీతో సహా విజయవంతమైన కథలు, ఫ్రాంచైజీలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ‘శనార్తి’తో ఆయన అనుబంధం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది.

Also Read:రీమేక్‌కు నో.. సొంత కథతో వచ్చా!

తన విలక్షణమైన సంగీతంతో శంసలు పొందిన సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతపరంగా మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి డీవోపీ, బేబీ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.

- Advertisement -