- Advertisement -
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈరోజు ఉదయం 7.30గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలు దేరాల్సిన విమానం సాంకేతిక కారణాలతో ఆలస్యం అయింది. దీంతో టేకాఫ్ కు రెడీగా ఉన్న సమయంలో ఈసమస్య ను గుర్తించారు ఫైలెట్లు.
చివరి నిమిషంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు.. దాదాపు రెండు గంటల పాటు ఈసమస్య కోసం ప్రయత్నించినా పరిష్కారం కాకపోవడంతో ప్రయాణికులు అందోళన చేశారు. దీంతో చేసేదేమి లేక ప్రయాణికులను వేరే విమానంలో పంపించారు.
- Advertisement -