బుల్లిఉల్లితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

44
- Advertisement -

ఉల్లిపాయలో చాలానే రకాలు ఉంటాయి. సాధారణ ఉల్లిపాయతో పాటు తెల్ల ఉల్లిపాయ మరియు చిన్నఉల్లిపాయ.. ఇలా కొన్ని రకాలు మనకు మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి. చిన్న ఉల్లిపాయలు లేతగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిలో ఉల్లిపొరలు కూడా తీయడానికి వీలు లేకుండా ఉంటాయి. అయితే మనం సాధారణ ఉల్లిపాయలను ఊపయోగించినట్లుగా చిన్నఉల్లిని ఉపయోగించడానికి అనాసక్తి చూపిస్తూ ఉంటాము. అయితే చిన్నఉల్లిపాయలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు మెండుగా ఉంటాయి. ప్రతిరోజూ ఈ చిన్నఉల్లిని మన ఆహారంలో చేర్చుకుంటే అనారోగ్యం దరి చేరదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..

జలుబు, దగ్గు, వంటి సమస్యలతో తరచూ బాధపడే వాళ్ళు ఒక చిన్న ఉల్లిపాయను నమిలి మింగేసి ఒక గ్లాస్ నీరు తాగితే.. ఆ సమస్యలన్నీ పరార్ అవుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా గుండె దడ సమస్యతో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. ఏ చిన్న విషయానికైనా టెన్షన్ పడుతూ, హార్ట్ బీట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ సమయంలో హైబిపి పెరిగి హార్ట్ ఎటాక్ కు కూడా దారితీసే అవకాశం ఉంది. కాబట్టి గుండెదడ ఉన్నవాళ్ళు చిన్నఉల్లిని తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు గుండె సమస్యలు రాకుండా చూస్తాయి.\

Also Read: బత్తాయి రసంతో ఆ సమస్యలు దూరం.. !

ఇక చిన్న ఉల్లిపాయ తరుగును నువ్వుల నూనెలో వేపుకొని వేడి వేడి అన్నంలో తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే ఈ యొక్క చిన్న ఉల్లిపాయ తరుగును మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అలాగే మహిళల్లో ఏర్పడే రుతుక్రమ సమస్యలు తొలగిపోవాలంటే రోజుకు ఒకటి లేదా రెండు చిన్నఉల్లిపాయ ముక్కల్ని తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బుల్లిఉల్లి ముక్కల్ని దోరగా వేయించిన నేతిలో తింటే నరాల బలహీనతకు చెక్ పడుతుందట. ఇలా చిన్నఉల్లిపాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయి కాబట్టి సాధారణ ఉల్లివలె చిన్న ఉల్లిని కూడా మన ఆహార డైట్ లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఇవి చేస్తే జిమ్ కు వెళ్లకుండానే.. ఫుల్ ఫిట్ !

- Advertisement -