పాపం.. మళ్లీ సౌత్ వైపు చూస్తోంది

36
- Advertisement -

షాలిని పాండే గుర్తుందా..? ఆమె సౌత్ లో సినిమా చేసి రెండేళ్లు దాటింది. రీసెంట్ గా ఓ సినిమా చేసినప్పటికీ అది థియేటర్లలోకి రాకుండా, నేరుగా ఓటీటీలో రిలీజైంది. అలా సౌత్ లో లాంగ్ గ్యాప్ వచ్చేసింది ఈ పొట్టి ముద్దుగుమ్మకి. అర్జున్ రెడ్డితో భారీ విజయాన్ని అందుకున్నా.. ఆశించిన స్థాయిలో కెరీర్ లో ఎదగలేక పోయింది. అయితే, షాలిని పాండేకి ఆ మధ్య తెలుగులో చిన్నాచితకా సినిమాలు బాగానే వచ్చాయి. కరెక్ట్ గా ఆ సమయంలో అమ్మడు తెలుగు పై చిన్న చూపు చూసింది. తనకు బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంది అని గొప్పలు పోయింది.

కట్ చేస్తే బాలీవుడ్ లో వాలింది. అక్కడ ఎంత ప్రయత్నించినా ఛాన్స్ లు రాలేదు. వచ్చిన అవకాశాల్లో విషయం లేదు. మొత్తానికి షాలిని పాండేకి హిందీలో కాలం కలిసిరాలేదు. అందుకే, ఇన్నాళ్లకు మళ్లీ సౌత్ పై ఫోకస్ పెట్టింది ఈ హీరోయిన్. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటించబోతోంది. త్వరలోనే లవర్ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాడు హీరో రాజ్ తరుణ్. ఈ సినిమాలో హీరోయిన్ గా మరోసారి షాలిని పాండేను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు డిస్కషన్లు మొదలయ్యాయి. లవర్ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది షాలిని పాండే.

సినిమాలో ఆమె పోషించిన పాత్ర చనిపోతుంది. అయితే సీక్వెల్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం షాలిని పాండే ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. తెలుగులో మాత్రం ఆమె ఇంకా ఎలాంటి కొత్త సినిమాలకూ కమిట్ అవ్వలేదు. అవ్వలేదు అనే దానికంటే ఆమెకు కొత్త సినిమా ఆఫర్లు రాలేదు. కాకపోతే, రాజ్ తరుణ్ అనే చిన్న హీరో పుణ్యమా అని ఈ కొత్త ఏడాదిలో షాలిని పాండే నుంచి తెలుగు సినిమా ప్రకటన రావడం గ్యారెంటీ.

Also Read:TTD:6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

- Advertisement -