శాకుంతలం రిలీజ్ డేట్ ఫిక్స్

317
samantha
- Advertisement -

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. సినిమా షూటింగ్ పూర్తయిన ఇంకా విడుదల తేదీ అనౌన్స్‌ చేయకపోవడంతో ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది.

ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. దీనికి సంబంధించి ఓ చిన్న వీడియో గ్లింప్స్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో సమంత, దేవ్ మోహన్.. శకుంతల, దుశ్యంతలుగా పోజిచ్చిన తీరు అద్భుతంగా ఉందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -