గుణశేఖర్ డైరెక్షన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అన్ని భాషల్లో విడుదలైన తొలిరోజే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ రూ.2 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. ఈ చిత్రానికి సమంత రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని.. అందులోని 50 శాతం తిరిగి ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also read: ఆదిపురుష్ కొత్త టీజర్ వైరల్
మరో వైపు దిల్ రాజు, గుణశేఖర్ సంయుక్తంగా నిర్మించిన ఈ శాకుంతలం సినిమా నిర్మాణానికి రూ. 70 కోట్లు వరకు ఖర్చు పెట్టారని చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు మాత్రం రూ.35 కోట్లకు అమ్మారని తెలుస్తోంది. సినిమాకి శాటిలైట్ రైట్స్ కూడా చాలా తక్కువకే పోతాయి అంటున్నారు. రూ.30 కోట్లు వరకు నష్టం వచ్చినట్లు నిర్మాతలు చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరికి ఎంత నష్టమే అన్నది తెలియాల్సి ఉంది.
Also read: Naresh:మళ్లీ పెళ్లి అప్డేట్
అయితే, శాకుంతలం నష్టాల్లో ఎక్కువ భాగం గుణశేఖర్ కే వచ్చేలా ఉన్నాయి. దిల్ రాజు ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యే సమయంలోనే… కొన్ని షరతులు పెట్టుకున్నారని.. ఈ షరతులు కారణంగా దిల్ రాజు కి 10 కోట్లు వరకు నష్టాలు రానున్నాయి. కానీ గుణశేఖర్ కి మాత్రం 20 కోట్లు వరకు నష్టాలు రానున్నాయి.