- Advertisement -
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేట్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పలు వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన 24గంటట్లోనే కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ ను నియమించింది. నోట్ల రద్దు సమయంలో ఆర్ధిక కార్యదర్శిగా పనిచేసిన శక్తికాంతదాస్ ను ఆర్బీఐ నూతన గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వు బ్యాంకుకు 25వ గవర్నర్ గా నియమించబడిన శక్తికాంతదాస్ ఈపదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
- Advertisement -