గంభీర్…ఎవర్ గ్రీన్ కెప్టెన్

28
gautam gambir

భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తన ఎవర్ గ్రీన్ కెప్టెన్‌ అని కొనియాడాడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబుల్ హాసన్‌.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షకీబ్…తన ఐపీఎల్ డ్రీమ్ ఎలెవన్‌ని ప్రకటించాడు.

తన 8 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు షకీబ్.కెప్టెన్‌గా గంభీర్‌ను ఎన్నుకున్న షకీబ్….వార్నర్, రాబిన్ ఉతప్ప ను ఓపెనర్లుగా తీసుకున్నాడు. 3 స్థానంలో గౌతమ్ గంభీర్ ,నాలుగో స్ధానంలో మనీష్ పాండేను ,5వ స్ధానంలో షకీబ్ బరిలో దిగనున్నాడు.

షకీబ్ అల్ హసన్ ఐపీఎల్ ఎలెవన్ : డేవిడ్ వార్నర్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్ (సి), మనీష్ పాండే, షకీబ్ అల్ హసన్, యూసుఫ్ పఠాన్, ఆండ్రీ రుసెల్, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ, ఉమేష్ యాదవ్