అమ్మాయి పిట్టలా ఉన్నా..పొట్టంతా ఇగోనే

207
Shailaja Reddy Alludu
- Advertisement -

టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి. భలే భలే మగాడివోయ్ సినిమాతో రూట్ మార్చిన మారుతి సీనియర్ హీరోగా వెంకటేష్ హీరోగా బాబు బంగారంతో పరవాలేదనిపించాడు. తర్వాత శర్వానంద్ హీరోగా మహానుభావుడు సినిమాతో మెప్పించిన శర్వా ప్రస్తుతం నాగచైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆగస్టు 31న ఆడియో వేడుకను నిర్వహిస్తామని ప్రకటించారు. తాజాగా మోషన్ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. చైతూ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ సినిమా టీజర్‌తో కథాంశం గురించి పూర్తి స్పష్టత వచ్చింది.

అమ్మాయి పిట్టలా ఉన్నా, పొట్టంతా ఇగోనే అంటూ హీరోయిన్ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన మారుతి ఈ పిల్లే ఇలా ఉంటే, ఇక తల్లెలా ఉంటుందో అంటూ హీరో చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇక రమ్యకృష్ణ‌ పవర్ ఫుల్ ఎంట్రీ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.

- Advertisement -