‘శైలజా రెడ్డి అల్లుడు’ నుండి మరో సాంగ్‌..

381
Shailaja Reddy Alludu
- Advertisement -

నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించారు. అయితే ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల వచ్చేనెల 13వ తేదీకి వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు చిత్ర బృందం.

Shailaja Reddy Alludu

“ఏ ఊరు .. ఏ దారి .. ఏ దూరమైనా .. నే రానా చేసేసి ఏ నేరమైనా .. గదులు ఆపేనా .. నదులు ఆపేనా .. నేను దాటేయనా .. చాటేయనా .. ప్రేమనీ .. ” అంటూ ఈ మెలోడీ సాంగ్ సాగుతోంది. కృష్ణకాంత్ సాహిత్యానికి గోపీసుందర్ బాణీని సమకూర్చగా, సిద్ శ్రీరామ్ .. లిప్సిక ఆలపించారు. హీరో హీరోయిన్‌లపై చిత్రీకరించిన ఈ పాట యూత్‌ను ఆకట్టుకునేలావుంది.

https://youtu.be/n7qlVYio5Xg

- Advertisement -