మ‌రుగుజ్జుగా మారిన షారుక్..

222
Shahrukh Khan upcoming Movie Name Zero
- Advertisement -

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ కి.. ఆయన రేంజ్ కి తగిన సినిమా వచ్చి చాలాకాలమే అయింది. హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా బాలీవుడ్ బాద్షా స్థాయిలో కలెక్షన్స్ రాలడం లేదు. అయితే.. సరైన సినిమా ఒక్కటి వస్తే చాలు.. షారూక్ ఖాన్ తన టాప్ స్థానాన్ని దక్కించుకోవడం సాధ్యమేనని అంటారు బాలీవుడ్ జనాలు.అయితే అందుకు తగ్గ ప్రాజెక్ట్ ఇప్పుడు షారూక్ చేతికి చిక్కినట్లే కనిపిస్తోంది. షారుక్ ఖాన్ కొత్త చిత్రం ‘జీరో’. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను తాజాగా విడుదల చేశారు.

Shahrukh Khan upcoming Movie Name Zero

ఈ చిత్రంలో షారుక్ మ‌రుగుజ్జు పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో షారుక్ స‌ర‌స‌న అనుష్క శ‌ర్మ న‌టిస్తోంది. క‌త్రినా కైఫ్ కూడా ఓ చిత్రంలో న‌టిస్తోంది. గ‌తంలో షారుక్‌, క‌త్రినా, అనుష్క శ‌ర్మ‌లు క‌లిసి ‘జ‌బ్ త‌క్ హై జాన్’ సినిమాలో న‌టించారు. ఈ చిత్రానికి షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2018 డిసెంబ‌ర్ 21న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

అయితే మరుగుజ్జు అంటే గతంలో మాదిరిగా చూపించీ చూపించకుండా కాకుండా.. ఒరిజినల్ గానే షారూక్ అలా మారిపోయిన స్థాయిలో పిక్చరైజేషన్ చేయడం విశేషం. ప్రస్తుతం గ్రాఫిక్స్ హైలెవెల్ లో అందుబాటులోకి రావడంతో.. ఇలా సాధ్యమైందని అర్ధం చేసుకోవచ్చు కానీ.. ఆ పాత్రలో కింగ్ ఖాన్ జీవించేసిన విధానం మాత్రం సూపర్బ్ అనాల్సిందే. ఈ చిత్రంతో పాటు 1970ల కాలం నాటికి సంబంధించిన టైటిల్స్ ను చూపిస్తూ.. జీరో మూవీ బ్యాక్ డ్రాప్ కూడా ఆ కాలం నాటిదే అని చెప్పకనే చెప్పారు మేకర్స్.

- Advertisement -