షారుఖ్ ఖాన్..బన్నీని కలుస్తాడట

24
- Advertisement -

అల్లు అర్జున్‌ పై బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ప్రశంసలు కురిపించారు. ‘జవాన్‌’లో షారుఖ్‌ తన స్టైల్‌ తో దేశాన్ని ఉర్రూతలూగించారని బన్నీ ట్వీట్ చేయ‌డం తెలిసిందే.జవాన్ మూవీలో షారుఖ్ స్వాగ్ చూసి తాను కూడా ఫిదా అయ్యినట్లు బన్నీ చెప్పాడు. అలాగే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి తన పాత్రలో ఎప్పటిలాగే చాలా అద్భుతంగా నటించారన్నారు. నయనతార, దీపికా నటన గురించి, అనిరుద్ మ్యూజిక్ గురించి కూడా బన్నీ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే, తాజాగా ఈ ట్వీట్ కి స్పందించిన‌ షారుఖ్‌ ఖాన్ కూడా ఓ క్రేజీ పోస్ట్ పెట్టాడు. తాను కూడా పుష్ప చిత్రాన్ని మూడ్రోజుల్లో మూడుసార్లు చూశాన‌ని, అల్లు అర్జున్‌ నటన చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నాన‌ని, త్వరలో మిమ్మల్ని కలుస్తాన‌ని షారుఖ్ ఖాన్ రీట్వీట్‌ చేశాడు. మొత్తానికి ‘పుష్ప’ మూడుసార్లు చూశాను అని షారుఖ్‌ ఖాన్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మూడు సార్లు చూసేంత పుష్పలో ఏముంది ? అంటూ బాలీవుడ్ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

అన్నట్టు షారుఖ్ ఖాన్, అట్లీ, అనిరుధ్ కాంబోలో వ‌చ్చిన జ‌వాన్ సినిమా అల్లు అర్జున్ ట్వీట్ చేసినందుకు గానూ.. సంగీత దర్శకుడు అనిరుధ్ “థాంక్యూ మై బ్రో” అని రిప్లై ఇవ్వ‌గా, దానికి బ‌న్నీ “సింపుల్ థాంక్స్ కాదు, నాక్కూడా గొప్ప పాట‌లు కావాలంటూ” ట్వీట్ చేశాడు. దీంతో త్వ‌ర‌లోనే బ‌న్నీ, అనిరుధ్ కాంబోలో సినిమా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఏది ఏమైనా నాకు థాంక్స్ కాదు నాక్కూడా గొప్ప సాంగ్స్ కావాలి అని అల్లు అర్జున్ అడగడం విశేషం.

Also Read:‘డెవిల్’ వార్…దర్శక-నిర్మాతల మధ్యలో!

- Advertisement -