Gold Price:లేటెస్ట్ ధరలివే

20
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు నిజంగా ఇది గుడ్ న్యూసే. గత 10 రోజుల్లో ఒక్క రోజు తప్ప మిగితా రోజుల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,600గా ఉంది.

బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న క్రమంలోనే సిల్వర్ రేట్లు కూడా ఇటీవలి కాలంలో భారీగా పడిపోయాయి. కేజీ వెండిపై రూ. 4 వేల వరకు పడిపోగా ప్రస్తుతం ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ. 73,500 వద్ద ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 77 వేలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్సుకు 1916 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.90 డాలర్లుగా ఉంది.

Also Read:కవిత ప్రశ్నలకు.. సమాధానమెక్కడ ?

- Advertisement -