స్టేడియంలో సినిమా.. స్టార్ హీరో రియాక్షన్

59
- Advertisement -

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డుంకీ’. ఈ మూవీ నుంచి ‘లుట్ పుట్ గయా’ వీడియో సాంగ్‌‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే విడుదలైంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షారుఖ్ ఖాన్ ట్విటర్‌లో అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘డుంకీ’ సినిమాను థియేటర్లలో కాకుండా స్టేడియాల్లో ప్రదర్శించాలని ఓ నెటిజన్ కోరారు. అయితే, దీనికి షారుఖ్ అదిరిపోయే సమాధానమిచ్చారు.

‘స్టేడియంలో ఏసీ ప్రధాన సమస్య. మీరు పిల్లలతో, పెద్దలతో సినిమా చూస్తుంటే అసౌకర్యంగా ఉంటుంది. అందువల్ల డిసెంబర్ 21న థియేటర్లలోనే ఈ సినిమాను చూడండి’ అని బదులిచ్చారు. ఇక ఈ సినిమాలో తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఇప్పటివరకూ ఈ సినిమాకి ఉన్న బజ్ ప్రకారం.. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ కలెక్షన్స్ ను ఈజీగా దాటేస్తోంది.

అన్నట్టు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్(IMDB) తాజాగా మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్-2023 లిస్టును విడుదల చేసింది. ఇందులో షారుక్ ఖాన్ నెంబర్ 1 స్థానంలో నిలిచారు. అలియా భట్, దీపికా పదుకొణె వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. వీరితో పాటు వామికా గబ్బి, నయనతార, తమన్నా, కరీనా కపూర్, శోభితా ధూళిపాళ, అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి టాప్-10లో చోటు దక్కించుకున్నారు.

Also Read:మలవిసర్జన కష్టంగా ఉందా..!

- Advertisement -