షారుఖ్ హిట్.. మెగా సినిమాకి అడ్డంకి

10
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా చిరంజీవి 156వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోనే చిరంజీవితో నయనతార రొమాన్స్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తీస్తున్నామని ఈ మధ్య ఈ సినిమాని గ్రాండ్ గా లాంఛ్ చేశారు సుస్మిత కొణిదెల. అందుకే, నయనతారను ఈ సినిమాలో తీసుకోవాలని ప్లాన్ చేశారు. నయనతార కూడా ఒప్పుకుంది. ఈ లోపు జవాన్ రిలీజ్ కావడం..నయనతార క్రేజ్ అమాంతం పెరగడంతో ఇప్పుడు ఆమె ఈ సినిమాకి చాలా షరతులు విధిస్తోంది.

వాటిలో ముఖ్యంగా రెమ్యునరేషన్ ను డబుల్ చేసింది. దాంతో మేకర్స్ ఇవ్వలేం అని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమా నుంచి నయనతార తప్పుకొంది. రెమ్యునరేషన్ విషయంలో ఆమె సినిమా నుంచి తప్పుకుంది అంటే.. తమ సంస్థకు బ్యాడ్ నేమ్ అని సుస్మిత కొణిదెల మరోలా వివరణ ఇస్తోంది. నయనతార వేరే సినిమాలకు డేట్స్ కేటాయించడం వల్ల ఆమె మా సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోతోంది. అందుకే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకొంది. త్వరలో మరో చిత్రంలో ఆమెతో కలిసి పనిచేసే అవకాశం వస్తుంది అని ఆశిస్తున్నా,” అని సుస్మిత కొణిదెల చెప్పుకొచ్చింది.

అంతే, సుస్మిత కొణిదెలకి ట్రోలింగ్ మొదలైంది. “సరే ఇప్పుడు నిజం చెప్పండి మేడమ్” అని కొందరు పోస్టులు పెట్టగా, మరికొందరు నయనతార తప్పుకుందా లేక “తప్పించుకొని బయటపడిందా మేడమ్” అంటూ అడుగుతున్నారు. మరోవైపు, నయనతార ఈ విషయంలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. సైలెంట్ గా తన పని తానూ చేసుకుంటూ పోతుంది. మొత్తమ్మీద షారుఖ్ ఖాన్ జవాన్ హిట్.. మెగా సినిమాకి పెద్ద అడ్డంకిగా మారింది.

Also Read:ఆ నటి మళ్లీ పెళ్లి.. నిజమేనా ?

- Advertisement -