మరుగుజ్జుగా అదరగొట్టిన షారుఖ్..జీరో ట్రైలర్‌

243
Shah Rukh Khan
- Advertisement -

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం జీరో. ఈ చిత్రంలో అనుష్క‌ శర్మ, కత్రినా కైఫ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందింది. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో షారుఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. అనుష్క మానసిక దివ్యాంగురాలి పాత్రలో క‌నిపించనుంది. ఇక ఈ చిత్రంలో కత్రినా సూపర్ స్టార్ పాత్ర పోషిస్తుండగా.. ఆమె ప్రేమను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు షారుఖ్.

Shah Rukh Khan

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీపై అంచనాలు పెంచేందుకు చిత్ర బృందం ప్రమోషన్స్‌ ప్రాంరంభించింది. ఈనేపథ్యంలో తాజాగా జీరో మూవీ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ రోజు షారుఖ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను వదిలారు. ట్రైలర్‌ను చూస్తుంటే.. షారుఖ్, అనుష్కా శర్మ తమ నటనతో అదరగొట్టారు. ఇక.. కత్రినా కైఫ్‌ తన అందచందాలతో మెరిసింది. 2018 డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

- Advertisement -