ఐడియా నుంచి అదిరిపోయే ఆఫర్‌..

244
- Advertisement -

టెలికాం కంపెనీల మద్య పోటీ నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఐడియా సెల్యూలార్ సంస్థ సరి కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. రూ.159 రీఛార్జ్‌తో 28జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించింది. కొద్దిరోజుల క్రితమే వొడాఫోన్ ఇండియా రూ.159 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వొడాఫోన్-ఐడియా విలీనం తర్వాత వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా అవతరించిన విషయం తెలిసిందే.

Idea Cellular

ఈ నేపథ్యంలో రెండు బ్రాండ్‌ల వినియోగదారులకు ఒకే రకమైన టారిఫ్‌లను అందించేందుకు ఉమ్మడి సంస్థ సన్నాహాలు చేస్తోంది. రూ.159 ప్లాన్ 28 రోజుల పాటు వర్తించనుంది. ఎఫ్‌యూపీ కింద రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.

- Advertisement -