రాజమౌళితో సినిమా చెయ్యాలని ఉంది…

263
Shah Rukh Khan Future of Indian cinema
- Advertisement -

ప్రస్తుతం ఇండియన్ సిని ప్రములందరి కళ్లు ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతున్న బాహుబలి పార్టు 2 పైనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఫిల్మ్ లవ్వర్స్  ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ తారలు కూడా ఉన్నారు. బాహుబలి తొలిపార్టు రిలీజ్ తరువాత బాలీవుడ్ మొత్తం జక్కన్న ప్రతిభకు సలాం కొట్టింది.
Shah Rukh Khan Future of Indian cinema
అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ లో బాహుబలి మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్… దర్శకధీరుడు రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు. తన దృష్టిలో ఇండియన్ సినిమా అంటే బాహుబలి అని అంటూ భవిష్యత్ భారతీయ సినిమాలకు బాహుబలి ఒక రోడ్ మ్యాప్ లా మారుతుంది షారుక్ తెలిపాడు.

తాను చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో నటిస్తున్న రోజులలో బాహుబలి ప్రారంభం అయిందని, ఆ తరువాత తాను మూడు సినిమాలలో నటించినా ఇంకా ‘బాహుబలి 2’ నిర్మాణం జరుగుతూనే ఉందని, అలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలను తీయడం ఒక రాజమౌళికే కుదురుతుంది అంటూ జక్కన్నను ఆకాశానికి ఎత్తేశాడు షారూఖ్. అంతేకాదు అలాంటి సినిమాలలో నటించాలని తనకు కూడ కోరిక ఉంది అంటూ రాజమౌళికి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు షారూఖ్.
Shah Rukh Khan Future of Indian cinema
అంతేకాకుండా  షారుక్ ఖాన్ ఏపీ ప్రత్యేక హోదాపై స్పందించాడు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పెషల్ స్టేటస్ కోరుకోవడం మంచి విషయమని, ప్రజల కోర్కెలను తీర్చడంలో ప్రభుత్వాలు ముందడుగు వేస్తే బాగుంటుందని అన్నాడు.  ప్రస్తుతం షారుక్ నటించిన రాయిస్ విడుదలై.. సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది. రాయిస్ కలెక్షన్లు మిడియా వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంతో ఫుల్ జోష్ మీద కింగ్ ఖాన్ తెలుగు మిడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సందర్భంగా  ఏపీ ప్రత్యేక హోదాపై షారుక్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఏదేమైనా  మొత్తానికి తెలుగు ప్రజల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నించాడు కింగ్ ఖాన్ షారూఖ్.

- Advertisement -