శాకుంతలంకు గుమ్మడికాయ కొట్టేశారు!

152
shakuntalam
- Advertisement -

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల‌లో పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక‌ల్ సినిమాగా తెరకెక్కుతోంది. దేవ్ మోహ‌న్ ఇందులో దుష్యంతుడు పాత్ర పోషించగా అల్లు అర్జున్ కూతురు అర్హ కీ రోల్ పోషించారు.

తాజాగా సినిమాకు సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు మేకర్స్ తాజాగా గుమ్మడికాయను కొట్టేశారు. తుది షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. దర్శకుడు గుణశేఖర్ కొన్ని కీలకమైన టాకీ సన్నివేశాలు, దుష్యంత్ పాత్రలో నటించిన హీరో దేవ్ మోహన్‌పై యుద్ధ ఎపిసోడ్‌ని ఇక్కడ రూపొందించారు. 2022 ప్రారంభంలో “శాకుంతలం” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమాలో భారతదేశం ఉత్తర నేపథ్యంలో బృందావనం, కాశ్మీర్, హిమాలయాలు వంటి భారీ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్‌ నిర్మించారు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో, రామోజీ ఫిల్మ్ సిటీ, అనంతగిరి కొండలు, వికారాబాద్ అడవులు, గండిపేట చెరువు, అన్నపూర్ణ స్టూడియోలలో సినిమా షూటింగ్ జరిగింది.

- Advertisement -