సినిమాల ఎంపిక విషయంలో తప్పుచేశా: సుశాంత్

57
sushanth

లాంగ్ గ్యాప్ తర్వాత సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ నెల 27న సినిమా రిలీజ్ కానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుశాంత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తనను హీరోగా,తన సినిమాలను ప్రమోట్ చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు సుశాంత్. ఇక తన కెరీర్ ప్రారంభంలో సినిమాల ఎంపిక విషయంలో తప్పుడు చేశానని అప్పటికీ తనకు మెచ్యూరిటీ లేదన్నారు. అయినా తన తప్పులకు తానే బాధ్యుడినని…“చిలసౌ”తో కొత్త ప్రయాణం ప్రారంభించానని వెల్లడించారు.

ఇక ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా ఓటీటీ విడుదలపై పెద్ద చర్చ జరిగిందని కానీ తాము సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఇక దర్శన్ నాకు కథ చెప్పినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను. అప్పుడు నేను అతనిని మరొక కథతో రావాలని అడిగాను. ఈ కథతో నన్ను నేను అన్వేషించుకునే అవకాశం వచ్చిందన్నారు.