టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నాయకులు..

256
- Advertisement -

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిపి. కమ్లీ మోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్,గిరిజన సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు హనుమానాయక్‌తో పాటు 50 మంది ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో తమ అనుచరులతో కలిసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై కడ్తాల్ మండల అభివృద్ధి కోసమే టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎంపీపీ,వైస్ ఎంపీపీ తెలిపారు.

Several Congress leaders join TRS

ప్రస్తుతం కరోనా ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది గుమికూడకుండ ఉండాలన్న ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తక్కవ సంఖ్యలో పార్టీలో చేరామని త్వరలోనే కడ్తాల్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో పద్దసంఖ్యలో తమ అనుచరులు పార్టీలో చేరనున్నట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

- Advertisement -