పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడేళ్లు..

4
- Advertisement -

పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ–కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఈ భయానక దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటన భారత చరిత్రలో ఒక విషాద అధ్యాయంగా నిలిచింది.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మరియు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అమరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రధాని మోదీ మాట్లాడుతూ, “మన సైనికుల సంకల్పం, దేశ సేవ ఎప్పటికీ నిలిచి ఉంటాయి. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది” అని పేర్కొన్నారు.

దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాయకులు హామీ ఇచ్చారు. పుల్వామా అమరవీరుల స్మారక స్థలాల్లో నివాళులర్పణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

Also Read:మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా!

ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు, సైనిక అధికారులు అమరవీరులను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. పుల్వామా అమరవీరుల త్యాగం దేశ ప్రజల్లో దేశభక్తి భావనను మరింత బలపరిచింది.

- Advertisement -