- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మూడేండ్లలోనే పూర్తిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మరో అద్భుతం ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం నంది పంపు హౌస్ 6 ప్యాకేజ్ ద్వారా 6459 కుసెక్కులు 3 పంపులు ద్వారా నీటిని గాయత్రి పంపు హౌస్‌కు వదులుతున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదవ ప్యాకేజీ లోని గాయత్రి పంప్ హౌస్‌లో ఏడవ బాహుబలి పంప్ హౌస్‌ల నుండి 3 పంపు ల ద్వారా 9450 కూసెక్కుల నీటిని ఇంజనీరింగ్ అధికారులు విడుదల చేశారు.
ఇప్పటికే గాయత్రి పరిధిలోని మొత్తం 7 పంపుల వెట్ రన్ విజయవంతమైంది. ఈ రోజు 3 పంపులు ద్వారా నీటిని మిడ్ మనై రుకు వదులుతున్నారు.దీన్ని ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వం నీటి సలహాదారు పెంటా రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ పర్యవేక్షింస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు పంప్ సెట్స్ రన్ చేశారు.
- Advertisement -