నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన సంస్థ‌ల‌కు జరిమానా

513
GHMC special drive
- Advertisement -

నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన ఏడు సంస్థ‌ల‌కు రూ. 1.48 కోట్ల జ‌రిమానా విధించిన‌ట్లు జిహెచ్ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్ & డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అన‌ధికారికంగా బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు, క‌టౌట్లు, వాల్‌పోస్ట‌ర్లు ఏర్పాటు, నాలాలు, రోడ్ల‌పై చెత్త‌చెదారం డంపింగ్ చేసిన సంస్థ‌లు, వ్య‌క్తుల‌పై భారీ ఎత్తున జ‌రిమానాలు విధిస్తున్న‌ట్లు తెలిపారు. న‌గ‌రాన్ని స్వ‌చ్ఛ‌త‌గా, ప‌రిశుభ్రంగా ఉంచ‌డ‌మే జిహెచ్ఎంసి లక్ష్య‌మ‌ని పేర్కొన్నారు. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన సంఘ‌ట‌న‌లపై సెంట్ర‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌ విభాగం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

సెంట్ర‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ రూపొందించిన ప్ర‌త్యేక యాప్ ద్వారా పౌరులు సామాజిక బాధ్య‌త‌తో ఈ సంఘ‌ట‌న‌ల ఫోటోల‌ను పంప‌వ‌చ్చున‌ని తెలిపారు. ఈ విధంగా ఇప్ప‌టి వ‌ర‌కు 44,403 అతిక్ర‌మ‌ణ‌ల ఫోటోల‌ను సి.ఇ.సి మొబైల్ యాప్ ద్వారా అందిన‌ట్లు తెలిపారు. 2019 అక్టోబ‌ర్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 8,60,755 పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు, క‌టౌట్లను తొల‌గించిన‌ట్లు తెలిపారు. సి.ఇ.సి ద్వారా ప్ర‌తి అతిక్ర‌మ‌ణ ఫోటోను జియోట్యాగింగ్ చేసి యూనిక్ నెంబ‌ర్‌ను ఇచ్చి త‌దుప‌రి చ‌ర్య‌ల‌కై మానిట‌రింగ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ అంశంపై ప్ర‌ధానంగా ఏడు సంస్థ‌ల‌పై విధించిన జ‌రిమానా వివ‌రాలు:
1. ది బ్రిటీష్ స్పోకెన్ ఇంగ్లీష్ -రూ. 33,62,000

2. ది రాపిడో బైక్ ట్యాక్సి -రూ. 13,79,000

3. ది నేచుర‌ల్ హేర్ ట్రీట్‌మెంట్ -రూ. 39,56,000

4. ది వెంక‌ట్ జాబ్స్ ఇన్ ఎం.ఎన్‌.సి -రూ. 29,44,000

5. ది బిల్ సాప్టు టెక్నాల‌జీస్ – రూ. 9,38,000

6. యాక్టు ఫైబ‌ర్ నెట్ -రూ. 14,19,000

7. ది హాత్ వే బ్రాండ్ -రూ. 8,13,000

మొత్తం: – రూ. 1,48,11,000

నిబంధ‌న‌ల అతిక్ర‌మ‌ణ‌ల‌పై వ్యాపార సంస్థ‌లు, షాపుల‌కు జ‌రిమానాలు విధిస్తూ నోటీసులు ఇచ్చిన‌ట్లు విశ్వ‌జిత్ తెలిపారు. ఆ నోటీసుల‌కు స్పందించి ఆన్‌లైన్ ద్వారా జ‌రిమానాలు చెల్లించాల‌ని సూచించారు.

- Advertisement -