ముసుగు తీసిన మోదీ….!

349
modi stadium
- Advertisement -

పబ్లిసిటీ..పబ్లిసిటీ…ఇది కాషాయ పబ్లిసిటీ అంటూ ప్రధాన మంత్రి మోదీ సార్ మన రాంగో స్టైల్లో అదేనండి రాంగోపాల్ వర్మ స్టైల్లో పాటలు పాడుతున్నారు. మోదీ సార్‌కు పబ్లిసిటీ పిచ్చి ఓ మోతాదు ఎక్కువేనండోయ్…అమెరికా వెళ్లినా…మన అచ్చంపేట వచ్చినా..సార్‌ పబ్లిసిటీ కోరుకుంటారు..అమెరికా తిక్కలోడు ట్రంప్ ఇండియాకు వస్తే..400 కోట్లు ఖర్చుపెట్టి అహ్మదాబాద్‌లో కొత్తగా కట్టిన మొతెరా స్టేడియంలో ఆప్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ ఆయన్ని తెగ వాటేసుకుంటూ..చేతులు ఊపుకుంటూ తెగ హడావుడి చేశారు. పైగా మోదీ సార్ ఎక్కడకు వెళ్లినా కెమెరాను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు..తాను కనిపించకుండా ఎవరైనా అతిధులు కెమెరాకు అడ్డువస్తే..మోదీగారికి తెగ మండుద్ది..వాళ్లు దేశ అధ్యక్షులైన సరే..జరగవయ్యాబాబు..కెమెరాలకు అడ్డం వస్తున్నావంటూ వారిని పక్కకు తోసేస్తుంటారు..అంతలా మోదీ సార్ పబ్లిసిటీ పిచ్చి…తాజాగా మోదీగారి పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్టగా అహ్మదాబాద్‌లో అంగరంగ వైభవంగా నిర్మించిన మొతెరా క్రికెట్ స్టేడియంకు సర్దార్ వల్లభాయ్ పటేల పేరు తీసేసి నరేంద్రమోదీ స్డేడియం అని పేరు పెట్టేసుకున్నారు.

స్వాతంత్ర సమరయోధుడైన పటేల్ పేరు తీసేసి స్టేడియంకు మోదీ పేరు పెట్టడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మోదీ సార్‌కు ఆమ్ ఆద్మీలకంటే..తన జాన్‌ జిగ్రీ దోస్తులైన అంబానీలు, అదానీలంటే ఎంత ప్రేమో అందరికి తెలిసిందే..బీఎస్ఎన్ఎల్, ఎల్‌ఐసీ, రైల్వేలు..ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను తన దోస్తులకు కట్టబెడుతున్నారు.ఇలా దేశాన్ని అంబానీలు, అదానీలకు తాకట్టు పెడుతూ సబ్ కా సాత్..సబ్ కా వికాస్ నినాదాన్ని కాస్తా అదానీ కా సాత్..అంబానీల కా వికాస్‌గా మార్చేస్తున్నారు. అంతటితో ఆగారు మహానుభావులు…మొతెరా స్టేడియంకు తన పేరు పెట్టుకోవడమే కాకుండా స్టేడియంలో గ్యాలరీలకు అంబానీ ఎండ్, అదానీ ఎండ్ అంటూ పేర్లు పెట్టేసి తన దోస్తులను తెగ ఖుషీ చేశారు. ఎక్కడైనా ఏ గవాస్కర్ ఎండో, ఏ సచిన్ ఎండో అని పేరు పెడతారు కాని…ఈ అంబానీ ఎండ్, అదానీ ఎండ్ అని పేరు పెట్టడం ఏంటని క్రీడాభిమానులు గుస్సా అవుతున్నారు. మీరు మరీనూ..తన ఇద్దరు దోస్తులు స్టేడియంకు డబ్బులు ఇచ్చిన్రు ఏమో..అలా స్టేడియంకు తన పేరుతో పాటు వాళ్ల పేర్లు కూడా పెట్టేసుకుని ముచ్చట పడిపోయారు.

ఇలా తన ఇద్దరు దోస్తుల రుణం తీర్చుసుకున్నారన్నమాట..ఇన్నాళ్లుగా కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ..హమ్ దో..హమారే దో..మేమిద్దం..మాకిద్దరు అంటూ సెటైర్లు వేస్తున్నా..మోదీ సార్ పెద్దగా పట్టించుకోలేదు..కాని మొతెరా స్టేడియంలో పేర్ల మార్చేసి … యే దోస్తీ…హమ్ నహీ ఛోడెంగే అంటూ మోదీషాలు, అంబానీ, అదానీలతో పాటలు పాడేస్తున్నారు. చల్లకొచ్చి ముంత దాచడం ఏంటనుకున్నారో..నేను మోనార్క్‌ను నన్నెవరు అడిగేది అనుకున్నారేమో…మోదీ సార్ ఇక ముసుగు తీసేశారు.తనకు అమీన్ కంటే..అమీర్‌లైన అంబానీ, అదానీలే ముఖ్యమని చాటిచెప్పేశారు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్..ప్రభుత్వం ఏం వ్యాపారం చేయదు..ఏమనుకుంటున్నారో ఏమో..ఒక్క ఎల్‌ఐసీ ఏంటీ..ఏదో మూడు, నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలను ఉంచుకుని అన్నింటిని ప్రైవేటీకరణ పేరుతో నా దోస్తులు అంబానీలు, అదానీలకు అప్పగించేస్తా…అంటూ తేల్చి చెప్పేసారు.. ఎన్నికల్లో గుజరాతీ సెంటిమెంట్ కోసం సర్దార్ పటేల్‌కు విగ్రహం కట్టించిన మోదీ..ఆఖరకు తన పబ్లిసిటీ పిచ్చి కోసం పటేల్ పేరునే తీసేసి తన పేరు పెట్టేసుకున్నారు. ఆఖరకు తన దోస్తుల పేర్లు కూడా పెట్టుకుని మురిసిపోయారు. ఆహా..మోదీ సార్‌ స్నేహానికి ఇచ్చిన విలువ చూస్తే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి..మొత్తంగా మొతరా స్టేడియంకు మోదీ పేరు పెట్టడం చూస్తే..ఇదేందిది..నేనెక్కడా చూడలే…మోదీ సార్‌కు మరీ ఇంత పబ్లిసిటీ పిచ్చా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

- Advertisement -