కోమటిరెడ్డి, సంపత్ లకు డివిజన్‌ బెంచ్‌ షాక్‌..

215
Set back for Expelled Congress MLAs
- Advertisement -

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ కు హైకోర్ట్‌ షాకిచ్చింది. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కేసులో కోమటిరెడ్డి, సంపత్‌ను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న సింగిల్ జడ్జ్‌ ఉత్తర్వులను రెండు నెలల పాటు హైకోర్టు నిలిపివేసింది.

Komati Reddy Venkat Reddy and Sampath kumar సింగిల్‌ జడ్జ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో అప్పీల్‌ చేసింది. అయితే ప్రభుత్వ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన హై కోర్టు ధర్మాసనం..అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను రెండు నెలల పాటు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. రాష్ర్ట ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కాగా..తదుపరి విచారణను 4 వారాల పాటు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

- Advertisement -