‘నోటా’కు నో చెప్పిన సుప్రీం..

172
NOTA option
- Advertisement -

నోటా(పైవేవీ కావు) ….ఈ ఆప్షన్‌ అందరికీ తెలిసిందే. ఎక్కువగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో ఈ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇప్పుడా ‘నోటా’ ఆప్షన్‌కి సుప్రీం కోర్టు నో చెప్పింది. అయితే  ప్రత్యక్ష ఎన్నికల్లో కాదు..రాజ్యసభ ఎన్నికల్లో. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు నోటా(పైవేవీ కాదు) ఆప్షన్‌ వర్తించబోదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

Supremeరాజ్యసభ ఎన్నికల్లో నోటాకు అనుమతినిస్తూ ఎన్నికల కమీషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ను పక్కపెట్టిన ధర్మాసనం..నోటా అనేది ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే …గుజరాత్‌ అసెంబ్లీలోని కాంగ్రెస్‌ చిఫ్‌ విప్‌ శైలేష్‌ మనుభాయ్‌ పార్మర్‌ రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ను ఎన్నికల సంఘం అనుమతించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రిం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

రాజ్యసభ ఎన్నికల్లో నోటా సదుపాయాన్ని అనుమతిస్తే.. అవినీతి ప్రోత్సహించినట్లు అవుతుందని ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు పార్మర్. కాగా..ఈ పిటీషన్‌ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ను తోసిపుచ్చుతూ..ప్రజలు నేరుగా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

 NOTA option

ఇదిలా ఉండగా..ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చకపోతే ఈ నోటా ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చని 2013లో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -