మహారాష్ట్రలో జికా వైరస్‌ , కలరా కలకలం

119
seasanol
- Advertisement -

దేశ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల అన్ని రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సీజనల్‌ వ్యాధులు ప్రభలమవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జికా వైరస్‌, కలరా వ్యాధులు వెలుగు చూడటం కలకలం రేపింది. ఓవైపు కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న వేళ సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. చికల్దరా , అమరావతి ప్రాంతాల్లో జులై 7 నుంచి కలరా వ్యాప్తి చెందుతుండగా, పాల్ఘర్‌లో జికా వైరస్‌ రెండవ కేసు నమోదైంది. ఇక పాల్ఘ‌ర్ బ్లాక్‌లోని ఆశ్ర‌మ‌శాల ప్రాంతంలో ఏడేండ్ల బాలిక‌కు జికా వైర‌స్ సోకిన‌ట్టు గుర్తించారు. గ‌తంలో ఇదే ప్రాంతంలో 2021 జులైలో తొలి జికా వైర‌స్ కేసు బ‌య‌ట‌ప‌డింది. జికా వైర‌స్ నియంత్ర‌ణ‌కు జిల్లా అధికార యంత్రాంగం ప్ర‌త్యేక క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది.

మహారాష్ట్రలో 181మంది కలరా రోగులను గుర్తించగా వారిలో 5గురు మరణించారని మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. క‌ల‌రా వ్యాప్తి చెందిన గ్రామాల్లో నీటి నాణ్య‌త‌ను ప‌రిశీలించి, మెరుగైన పారిశుద్ధ్యం, చికిత్స అందించేందుకు వైద్యాధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

- Advertisement -