రాబోయే తరానికి గ్రీన్ ఛాలెంజ్ ఆదర్శం కావాలి..

141
Green India Challenge
- Advertisement -

సెలబ్రిటీలనే కాకుండా సామాన్యులను సైతం ప్రభావితం చేస్తున్నది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా, అతని స్పూర్తితో నిజామాబాద్ లోని తమ నివాసంలో అంజీర్‌ మొక్క నాటి ప్రకృతి పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు సెరోల్ల రాజేశ్వర్ రావు దంపతులు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. మా పెళ్లిరోజు సందర్భంగా మొక్కనాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

కరోనా కష్ట కాలంలో ఆక్సీజన్‌ అందక సతమతమవుతున్న ఈ తరుణంలో ఎంపీ సంతోష్ కుమార్ చెప్పినట్లు జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సంతోష క్షణాన్ని మొక్క నాటి ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో బగస్వాములు కావాలి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మనకు శ్రీ రామ రక్ష అని పేర్కొన్నారు. ఇదే విధంగా భావితరానికి మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం అనేది ఒక ఆచారంగా మారాలని, అలాగే రాబోయే తరానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆదర్శం కావాలని కోరారు.

- Advertisement -