రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం..

219
covid

తెలంగాణలో గత కొన్నిరోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 62,591 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,961 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో తాజాాగా 30 మంది మరణించారు. అదే సమయంలో 5,559 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇంకా 49,341 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 5,32,784 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 4,80,458 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు.

అటు, తెలంగాణలో రికవరీ రేటు 90.17 శాతానికి పెరిగింది. జాతీయ స్థాయి రికవరీ రేటు 84.8 శాతంగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 631 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలు క్రమంగా కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది.