KCR:నాంపల్లిలో జాతీయ సమైక్యతా దినం

54
- Advertisement -

జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే అన్ని జల్లాల కేంద్రాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం.

గతేడాది కూడా తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మూడు రోజులపాటు ర్యాలీలు నిర్వహించడంతోపాటు వాడ వాడలా జాతీయ జెండాను ఎగుర వేశారు. సమైక్యత వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.

తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించి ఆనాటి పోరాట వీరులను సన్మానించనున్నారు. సమైక్యత వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులంతా పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ లో బహిరంగసభను నిర్వహించనుండగా ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రానున్నారు.

Also Read:చంద్రబాబుకు సానుభూతి వర్కౌట్ అయ్యేనా?

- Advertisement -