ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ కృషి అభినందనీయంః మోత్కుపల్లి

285
mothukupally narasimhulu
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది పనులపై టిడిపి సినియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ డబ్బులు లేని వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చారని ఈసందర్భంగా గుర్తు చేశారు. గత కొద్ది రోజులుగా టిడిపి పై మోత్కుపల్లి విమర్శులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా నేడు మీడియాతో మాట్లాడిన ఆయన టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. మాల మాదిగలకు గౌరవం ఇవ్వని చంద్రబాబు..అంబేద్కర్ విగ్రహం పెడతానంటే ఎందుకు అని నన్ను ప్రశ్నించారన్నారు.

mothkupalli

తెలంగాణలో చంద్రబాబు మాటకు విలువ లేదన్నారు. ఆరునెలలకు ఒకసారి రాష్ట్రానికి వస్తే పార్టీ పరిస్ధితి ఇలాగే ఉంటుందన్నారు. చంద్రబాబు రేవంత్ ను నమ్మి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే పార్టీని మొత్తం భ్రష్ట్రు పట్టించాడన్నారు. రేవంత్ విషయంలో గట్టిగా మాట్లాడినందుకే తనకు చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. వచ్చే సంవత్సరం అసలు ఏపీలో టిడిపి గెలుస్తుందా అని ప్రశ్నించారు. తనను టిడిపి నుంచ గెంటేసే ప్రయత్నం జరగుతుందన్నారు. నాకు గవర్నర్ పదవి ఇస్తా అని చెప్పి….ఆ పదవి రాకుండా చేసింది చంద్రబాబే అన్నారు. 30ఏళ్లుగా పార్టీకోసం పనిచేసిన తనకు పార్టీల కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదన్నారు.

mothkupalli

కొత్తగా వచ్చిన నాయకులకు పెద్ద పదవులిచ్చి..సినియర్ నాయకులను పట్టించుకోవడం లేదన్నారు. పార్టీలో సినియర్లకు గౌరవం లేదన్నారు. నాకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ కు ప్రేమతో ఇంకా పార్టీలో కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. చంద్రబాబను నమ్ముకుంటే నన్ను నట్టేట ముంచారన్నారు. నిన్న జరిగిన మహానాడుకు కూడా నాకు ఆహ్వనం అందలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే టిడిపిలో సినియర్లకు ఎంత గౌరవం ఇస్తున్నారో అర్దం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు మోత్కుపల్లి.

- Advertisement -