ఒకప్పడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన నటి రాశి గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల రాశి. తెలుగులో రాశి నటించిన పెళ్లి పందిరి, శుభాకాంక్షాలు, ప్రేయసి రావే సినిమాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న రాశి పెద్దగా సినిమాల్లో నటించలేదు. తెలుగు, తమిళ్ లో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది రాశి.
అయితే ఇన్ని రోజులు బొద్దుగా ఉన్న రాశి ఇప్పుడు స్లిమ్ గా మారిపోయింది. రాశి న్యూలుక్ చూస్తే అసలు ఆమెను గుర్తు పట్టడం చాలా కష్టం. రాశి ప్రస్తుతం ఓ తమిళ్ మూవీలో నటిస్తోంది. ఈమూవీలో రాశి పవర్ పుల్ పోలీస్ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈమూవీలో రాశి లుక్ విడుదలైంది. పోలీస్ గెటప్ రాశి అందరిని ఆకట్టుకుంటుంది. రాశి ఈజ్ బ్యాక్ అంటూ ఓ ఫోటోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.