తెలుగు బిగ్ బాస్ 2 సెల‌బ్రెటీలు వీళ్లే?

237
Bigg Boss Telugu season 2 Here's the list of expected contestants
- Advertisement -

తెలుగు రీయిల్టీ షో లలో అతిపెద్ద విజ‌యం సాధించిన బిగ్ బాస్ షో మ‌రో సిజ‌న్ తో బుల్లితెర‌పై అల‌రించ‌నుంది. ఈషో సెకండ్ సిజ‌న్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సిజ‌న్ 1 బుల్లితెర‌పై భారీ విజ‌యాన్ని సాధించింది. బిగ్ బాస్ షో వ‌ల్ల స్టార్ మా రేటింగ్స్ సైతం అమాంతం పెరిగిపోయాయి. గ‌త సిజ‌న్ లో బిగ్ బాస్ ను ముంబై వేదిక‌గా నిర్వ‌హించ‌గా..ఈసారి హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోస్ లో సెట్టింగ్ వేసిన‌ట్లు తెలుస్తుంది.

Bigg Boss Telugu season 2 Here's the list of expected contestants

ఈ షోలో పాల్గోనే సెల‌బ్రెటీలు కూడా ఫిక్స్ అయిపోయినట్టు స‌మాచారం. హీరో నాని బిగ్ బాస్ 2 కి హోస్ట్ చేయ‌బోతున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుత‌న్న విష‌యం తెలిసిందే. ఇక బిగ్ బాస్ 2కు సంబంధించి ఓ న్యూస్ వైర‌ల్ అవుతోంది. సిజ‌న్ 1 క‌న్నా సిజ‌న్ 2లో గ్లామ‌రస్ గా ఈషోను నిర్వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం. ఎక్కువ మంది మ‌హిళ‌లు ఈషో లో పాల్గోనున్నార‌ని తెలుస్తుంది.

Bigg Boss Telugu season 2 Here's the list of expected contestants

బిగ్ బాస్ హౌజ్ కు రావ‌డానికి రెడీ అయిపోయిన సెల‌బ్రెటీల పేర్లు కొంత‌మందివి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వారిలో సింగ‌ర్ గీతామాధురి, హీరోయిన్ గ‌జాలా, సీనియ‌ర్ న‌టీ రాశి, న‌టి తేజ‌స్వీ మ‌డివాడ‌, యాంక‌ర్ శ్యామ‌ల ఇలా కొంత‌మంది రెడీగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈషోకు సంబంధించిన ప్రోమోను కూడా త‌యారు చేస్తున్న‌ట్లు సమాచారం. బిగ్ బాస్ 2కి వ‌చ్చే సెల‌బ్రెటీల పేర్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన విరి పేర్లు మాత్రం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

- Advertisement -